రాజన్న హుండీ ఆదాయం రూ. 1 కోటి 69 లక్షలు

రాజన్న హుండీ ఆదాయం  రూ. 1 కోటి 69 లక్షలు

వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 1 కోటి 69 లక్షలు వచ్చినట్టు ఆలయ ఈవో వినోద్​ తెలిపారు. 15 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్​లో  ఈవో సమక్షంలో ఎస్పీఎఫ్​ సిబ్బంది పర్యవేక్షణలో లెక్కించారు. 

ఈ సందర్భంగా ఆలయ ఖజానాకు రూ. 1 కోటి 69 లక్షల76 వేల 867 నగదు, 116 గ్రాముల బంగారం, 9 కిలోల 800 గ్రాముల వెండి సమకూరినట్లు పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.