
- వేములవాడ రాజన్నకు భారీ ఆదాయం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో లెక్కించారు. 28 రోజులకు గానూ రూ. 1.87 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 115.900 గ్రాములు, వెండి 9.500 కిలోలు వచ్చినట్లు ఈవో వినోద్‌రెడ్డి చెప్పారు. హుండీ లెక్కింపులో అబ్జర్వర్ సత్యనారాయణ, ఏఈవోలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.