మహాశివరాత్రి జాతరకు వేములవాడ ముస్తాబు.. పూజల వివరాలివే..

మహాశివరాత్రి జాతరకు వేములవాడ ముస్తాబు.. పూజల వివరాలివే..
  • ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు 
  • 4 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా
  • 2 వేల మంది పోలీసులతో బందోబస్తు

‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు: తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం శివరాత్రి జాతరకు సిద్ధమవుతోంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈసారి ఈ ఉత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రూ.1.75కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ నుంచి భక్తులు తరలివస్తుంటారు.

 మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా, ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌ మహాజన్‌‌‌‌‌‌‌‌, ఈవో కృష్ణప్రసాద్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షిస్తున్నారు. వసతి గదులు, చలువ పందిళ్లు, రవాణా, తాగునీరు, పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

గుడిచెరువు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో శివార్చన 

జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే శివార్చన చేపట్టేందుకు స్టేజీ సిద్ధం చేశారు. భక్తుల కోసం ఇప్పటికే 3.50 లక్షల లడ్డూలు తయారుచేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు తిప్పాపూర్​ప్రధాన బస్టాండ్​ నుంచి రాజన్న ఆలయం వరకు 14 ఉచిత మినీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు.

 లక్షలాది మంది రానుండడంతో శానిటేషన్ నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి 1200 మంది సిబ్బందిని తెప్పిస్తున్నారు. ఆలయంతోపాటు పరిసరాలు, గుడి చెరువు మైదానంలో కల్యాణకట్ట, ధర్మగుండం, భక్తుల వసతి కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కోడె మొక్కుల కోసం ఒక్కో షిఫ్ట్‌‌‌‌‌‌‌‌కు 60 కోడెల చొప్పున నాలుగు షిఫ్టుల్లో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 2వేల మంది పోలీసులతో బందోబస్త్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్​ మహాజన్​ తెలిపారు. గురువారం గుడిచెరువు ప్రాంగణంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు.  

జాతరలో సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తుంటామని, భక్తుల సౌకర్యార్థం పోలీస్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జాతరలో భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు తిప్పాపూర్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల బస్టాండ్‌‌‌‌‌‌‌‌, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌, రాజేశ్వరపురం, ప్రధానాలయం ముందు, సంస్కృత కళాశాలల్లో ఫస్ట్ ఎయిడ్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

పూజల వివరాలిలా.. 

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహశివరాత్రి జాతర మహోత్సవ పూజల వివరాలను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 25న రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, 7.30 లకు టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందని,  రాత్రి 9 గంటల నుంచి భక్తులకు లఘు దర్శనం, కోడె మొక్కులు కొనసాగుతాయి.

మహాశివరాత్రి రోజు 26న రాత్రి 11 గంటల నుంచి 1.30 వరకు భక్తులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు దాతలు, స్థానిక అధికారులకు దర్శనం, ఉదయం 3.30 నుంచి 3.40 గంటల వరకు ఆలయ శుద్ధి,  ఉదయం 3.40 గంటల నుంచి 4.23 గంటల వరకు సుప్రభాతం, ఆ తర్వాత 6 గంటల వరకు ప్రాతకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, సాయంత్రం 6.05 గంటల నుంచి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులు మహా లింగార్చన, రాత్రి 11.35 గంటలకు లింగోద్భావ కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.