వేములవాడ గుడి విస్తరణ డిజైన్స్​కు..శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి

వేములవాడ గుడి విస్తరణ డిజైన్స్​కు..శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి
  •     అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచన
  •     సీఎంను ఆశీర్వదించిన ఆలయ అర్చకులు

హైదరాబాద్/ వేములవాడ, వెలుగు : వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అర్చకులు సెక్రటేరియేట్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించారు. 

ALSO READ : స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్​ స్కూల్స్ డిజైన్ల పరిశీలన

ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వినోద్, స్తపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ తదితరులు ఉన్నారు.