20 రోజుల్లో రూ. 1.54 కోట్లు

  • వేములవాడకు భారీగా ఇన్ కం

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కించారు. 20 రోజుల హుండీలను లెక్కించగా రూ. 1.54 కోట్లు, 402 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి వచ్చినట్లు ఈవో కృష్ణ ప్రసాద్ చెప్పారు. 

అషాఢమాసం ప్రారంభమైనప్పటికీ భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వేములవాడకు రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు.