వేమలవాడలో ఓ పక్క పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం..మరోపక్క శివయ్యను పెళ్లాడిన జోగినీలు.. హిజ్రాలు

వేమలవాడలో ఓ పక్క  పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం..మరోపక్క  శివయ్యను పెళ్లాడిన జోగినీలు.. హిజ్రాలు
  • సంబురంగా శివపార్వతుల లగ్గం
  •  ఎములాడలో ఏటా కామదహనం తదుపరి మహాక్రతువు 
  •  అక్షింతలు, జీలకర్ర బెల్లం పెట్టుకొని పెళ్లాడిన హిజ్రలు, జోగినిలు 
  •   రాజన్న సన్నిధికి  పోటెత్తిన భక్తులు 
  •  పట్టువస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో, మున్సిపల్​కమిషనర్​ 

వేములవాడ:  దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి  దివ్య కళ్యాణం ఇవాళ అంగరంగా వైభవంగా కన్నుల పండువగా జరిగింది. అయితే ఎక్కడ లేని విధంగా ఒక వైపు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే మరోక వైపు శివపార్వతులు, జోగినిలు, హిజ్రలు శివుడిని పెళ్లాడుతూ తస్మయం చెందారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని చోట్ల మహ శివరాత్రి రోజు శివ కళ్యాణం జరిగితే వేములవాడ లో ఏటా కామదహనం తర్వాత శివ పార్వతులు కళ్యాణం జరుగుతున్న అనవాయితీ కొనసాగుతుంది.  ఆలయ  చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద వరకు ఎదుర్కొళ్లు నిర్వహించారు. రెండు గంటల పాటు  వేద మంత్రోచ్చారల తో శ్రీ స్వామి వారి కళ్యాణం  ఘనంగా జరిపించారు. 

 దివ్య కళ్యాణ మహోత్సవం కు   దేవస్థానం తరుఫున ఆలయ ఈఓ వినోద్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్వామి వారికళ్యాణంకు పట్టు వస్ర్తాలు సమర్పించారు.   మహా క్రతువులో  మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  సతీమణి మంజుల పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ర్టం నలుమూలల నుండి వేలాది గా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు.  

రాజన్న సన్నిధిలో శివ పార్వతులు  జోగినిల సందడి చేశారు.  కళ్యాణ సమయంలో శివున్నే పెళ్లి చేసుకున్నట్లు భావించి, జీలకర్ర బెల్లం పెట్టుకొని అక్షింతలు వేసుకున్నారు. శివ పార్వతులు, జోగినిలు   ప్రతి సంవత్సరం శివ కళ్యాణం నాడు సాక్షాత్తు శివున్నే పెళ్లి చేసుకున్నట్లు భావించుకోవడం తమకు వరంగా వస్తుందని, ఈసారి సైతం స్వామివారి కల్యాణంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.