- స్వామి ఆశీస్సులు ఉండాలన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుతోనే ప్రజాపాలన సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా శుక్రవారం వేములవాడ రాజన్న కు 55 కోడె మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని, ఆలయాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసేందుకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే సీఎం జిల్లా పర్యటనకు వస్తారని, రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేశ్, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేశ్, కొక్కుల రాజు, చిలుక రమేశ్, తోట రాజు, ఇటిక్యాల రాజు, సాయికుమార్ పాల్గొన్నారు.