నేటి నుంచి వెండికొండ సిద్ధేశ్వరస్వామి జాతర

నేటి నుంచి వెండికొండ సిద్ధేశ్వరస్వామి జాతర

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయ జాతర శనివారం నుంచి మొదలుకానుంది. ఈ సందర్భంగా ఇటీవల దాతల సహకారంతో నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ నాలుగో తరం ఫౌండర్, ట్రస్ట్ చైర్మన్ మడపతి నరేందర్ తెలిపారు. ముఖద్వార నిర్మాణానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా వెండి కొండ సిద్దేశ్వరస్వామి ఊరేగింపు ఉంటుందన్నారు. మూడు రోజులపాటు కొనసాగే జాతరలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్​జిల్లాల భక్తులు పాల్గొంటారని తెలిపారు.