గులాబీ గూటికి వేనేపల్లి వెంకటేశ్వరరావు, కర్నాటి వెంకటేశం

నల్గొండ జిల్లా : నాంపల్లి మండలానికి చెందిన వేనేపల్లి వెంకటేశ్వరరావు మళ్లీ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో బై పోల్ వచ్చింది. ఈ ఉప ఎన్నికను ఎలాగైనా గెలవాలనే కృత నిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్.. మళ్లీ వేనేపల్లి వెంకటేశ్వరరావును పార్టీలోకి తీసుకుంది. మరోవైపు చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం కూడా మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు.