ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి

వెనిజులా మహిళలకు ఆ దేశ ప్రెసిడెంట్‌‌‌‌ సూచన

కరాకస్‌ : వెనిజులా ప్రెసిడెంట్‌‌‌‌ నికోలస్‌‌‌‌ మదురో ఆ దేశ ఆడోళ్లకు ఒక వింత సూచన చేశారు. దేశ జనాభాను పెంచేందుకు ఒక్కొ క్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని సూచించారు. వెనిజులాలో ఏర్పడ్డ ఎకనామిక్‌‌‌‌ క్రైసిస్‌‌‌‌ కారణంగా చాలా మంది వలస వెళ్లడంతో ఈ సూచనలు చేశారు. “ ప్రతి మహిళకు ఆరుగురు పిల్లలను ఇవ్వాలని దేవుడ్ని కోరుతున్నాను. మన దేశం జనాభాతో కళకళలాడాలి” అని ఒక టీవీ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌‌‌‌ కామెంట్‌‌‌‌ చేశారు. దీంతో ఆయనపై హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పిల్లలకే తిండి పెట్టలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, అలాంటిది ఈ సూచనలు చేయడం ఏంటని సీరియస్‌‌‌‌ అయ్యారు. ప్రజలు కూడా ప్రెసిడెంట్‌‌‌‌ కామెంట్స్‌‌‌‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, రాజకీయ కారణాల వల్ల 2015 నుంచి ఇప్పటి వరకు వెనిజులా నుంచి 45లక్షల మంది ప్రజలు వలస వెళ్లారు. అంతే కాకుండా దేశంలోని దాదాపు 93 లక్షలు అంటే దేశంలోని మూడో వంతు ప్రజలు తమ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక పోతున్నారని యూఎన్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చెప్పింది.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు