ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు

రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఎంపీలను మందలించారు. కొంతమంది ఎంపీలు రాజ్యసభలో మొబైల్స్ వాడుతుండటం గమనించిన ఆయన.. ఎంపీలు పార్లమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభలో జరుగుతున్న కార్యకలాపాలను కొంతమంది ఎంపీలు మొబైల్ ఫోన్‌లతో రికార్డ్ చేస్తున్నారు. ఇలా చేయడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధం. రాజ్యసభలో ఫోన్‌ల వాడకంపై పరిమితి ఉంది. హౌస్‌లో జరిగేవి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇటువంటి అవాంఛనీయ కార్యకలాపాలకు సభ్యులు దూరంగా ఉండాలి. సభలో అనధికారిక రికార్డింగ్ మరియు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలాంటివి సభ హక్కును ఉల్లంఘించడం మరియు సభ నియమాలను ధిక్కారించినట్లు అవుతుంది’ అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు.

For More News..

కుల బహిష్కరణ చేశారని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సీనియర్ నటి రాధిక

కూల్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా?