ఈశ్వరీబాయి జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తి

ఈశ్వరీబాయి జీవితం ఈ తరానికి ఎంతో ఆదర్శమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నాలుగు దశాబ్దాల ఆమె రాజకీయ, ప్రజాజీవితంలో ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడారని చెప్పారు. స్త్రీ, దళిత, పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. మురికివాడల్లో పిల్లల ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమం పై ఎనలేని కృషి చేశారని.. ఎప్పుడు అధికార దాహంతో లేకుండా..ప్రజల్లోనే మెలిగిందన్నారు. సీనియర్ గా ఆమె ప్రసంగం విని ఎంతో నేర్చుకున్నానన్నారు. విలువలకు  అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. నిఖచ్చిగా మాట్లాడే స్వభావం కల్గి ఉండేదన్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పారామంలో… పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.