
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వెంకన్న జాతర సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణం అంతా జనసంద్రంగా మారింది. ఉత్సవ కమిటీ చైర్మన్ అరెల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో వేద పండితులు పార్థసారధి, శ్రీధరాచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
మధ్యాహ్న సమయంలో విశ్వక్ సేన సమితి ఆధ్వర్యంలో కల్యాణ మండపంలో మహా అన్నప్రసాద వితరణ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేయూ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట రామ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి స్వామివారిని దర్శించుకున్నారు.