- కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి
కామారెడ్డి, వెలుగు : ఉద్యమగడ్డ కామారెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బరిలో నిలిచారు. బీజీపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో కామారెడ్డి దేశం దృష్టిని ఆకర్షించింది.కేసీఆర్అలవోకగా గెలుస్తారని కొందరు భావించగా, కామారెడ్డి రేవంత్‌రెడ్డిదే అని తమ వాదన వినిపించారు.
ఇద్దరు సీఎం స్థాయి వ్యక్తులను కాదని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు స్థానిక నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డికి పట్టం కట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హెలిక్యాప్టర్ లీడర్లంటూ.. తాను స్థానికుడిననే విషయాన్ని బలంగా తీసుకెళ్లారు. వివిధ సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేసిన కాటిపల్లి విజయం సాధించారు.