ప్రజల వద్దకు పాలన బీజేపీ నినాదం: కాటిపల్లి రామణారెడ్డి

కామారెడ్డి, వెలుగు: ప్రజల వద్దకు పాలనే బీజేపీ నినాదమని ఆ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. రాజంపేట మండల కేంద్రంతో పాటు, రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన పలువురు గురువారం బీజేపీలో చేరారు. రమణారెడ్డి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ..  ప్రజలు ఆఫీసర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, గ్రామాల్లోనే ఆఫీసర్లతో కలిసి తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రూ.వేల కోట్ల విలువైన అసైన్డ్​భూములు ఉన్నాయని, వాటిని దోచుకునేందుకే దొరలు ఇక్కడికి వస్తున్నారన్నారు. రాజంపేట ప్రెసిడెంట్​ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.