పింఛన్, ఉపాధి సొమ్ము కాజేసిన వెంకటాపూర్ బీపీఎం తొలగింపు

పింఛన్, ఉపాధి సొమ్ము కాజేసిన వెంకటాపూర్ బీపీఎం తొలగింపు

పరకాల, వెలుగు: ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడి రూ. లక్షల్లో కాజేసిన హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్​బీపీఎంను విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపూర్​బీపీఎం బి.నవీన్​కుమార్​ గ్రామానికి చెందిన కొందరు చనిపోగా పింఛన్లు, ఉపాధిహామీ పేమెంట్లను గ్రామ కార్యదర్శికి తెలియకుండా సుమారు రూ.6 లక్షలు కాజేశాడు. విచారణలో తేలడంతో అమౌంట్​రికవరీ చేసి విధుల నుంచి తొలగించి కేసు నమోదుకు పరకాల సీఐ క్రాంతికుమార్​కు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పరకాల ఏఎస్​పీ అనంతరామ్​నాయక్​ తెలిపారు. తపాలాశాఖలో అవినీతికి పాల్పడితే క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు.