డ్రంక్ ​అండ్ ​డ్రైవ్​ చేస్తే చర్యలు : ఎస్సై రేఖ అశోక్

వెంకటాపురం, వెలుగు : మద్యం తాగి ఇసుక లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం ఎస్సై రేఖ అశోక్ హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని వీరభద్రవరం గ్రామం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్​లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లారీలను వేగంగా డ్రైవ్​ చేయడం, వాహనాలకు ఇబ్బంది కలిగేలా ఓవర్​టేక్​ చేయకూడదని హెచ్చరించారు.