రవీంధ్రభారతిలో కాకా జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాకా సేవలు చిరస్మరణీయమని అన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు గతంలో కూడా సలహాలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాకా చాలా గొప్ప నాయకుడని అన్నారు. ప్రజా సమస్యల కోసం అహర్నిసలు పాటుపడ్డారని భట్టి అన్నారు.
కాంగ్రెస్ లో అంచెలంచలుగా ఎదిగిన కాకా.. హైదరాబాద్లో ఉండే నిరుపేదలకు ఆశ్రయం కల్పించిన మహానేత వెంకటస్వామి. కాంగ్రెస్ అధిష్ఠానం కాకాకు బాధ్యత అప్పగిస్తే దానిని తప్పక నెరవేర్చేవారని.. పేదల పక్షాన నిలబడ్డారన్నారు. తాను ఒకటి, రెండు సార్లు కాకాను కలిశానని తెలిపారు.