- వంశీకృష్ణకు టికెట్ వద్దనడం సరికాదు
గోదావరిఖని, వెలుగు : కాకా వెంకటస్వామి కుటుంబానికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో 60 ఏండ్ల అనుబంధం ఉందని -‘మాలమహానాడు ఆఫ్ ఇండియా’ జాతీయ అధ్యక్షుడు పి.రామ్మూర్తి చెప్పారు. కాగాపెద్దపల్లి నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. శుక్రవారం గోదావరిఖనిలోని లక్ష్మీప్రసన్న హాల్‌లో నిర్వహించిన మాలమహానాడు ఆఫ్ ఇండియా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ కొడుకు వంశీకృష్ణకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ వద్దని మాదిగ సోదరులు చెప్పడం సరికాదన్నారు. కాకా కుటుంబం ఏనాడూ మాల, మాదిగలను వేరు చేసి చూడలేదని, ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడిందని గుర్తుచేశారు. వంశీకృష్ణ గెలుపుకోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం మాలమహనాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర మహిళా కార్యదర్శిగా గంట బబిత, పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా సంబోదు సుశీలను ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్, జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.పుల్లయ్య, కార్యదర్శి కాసర్ల యాదగిరి, రాష్ట్ర కార్యదర్శులు జి.తిరుపతి, మధు, కృష్ణంరాజు, భాను ప్రసాద్, ఈసారపు శివ, రాజన్న తదితరులు పాల్గొన్నారు.