
నస్పూర్, వెలుగు: నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారి ప్రణాళికలతో ముందుకెళ్లాలని సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. శ్రీరాంపూర్ ఏరియాలో 2025–26 నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై ఏరియా జీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రివ్యూ నిర్వహించారు. అనంతరం శ్రీరాంపూర్ ఓసీపీ గనిని సందర్శించి గనిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు సంబంధించిన యంత్రాల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిల్వ ఉన్న బొగ్గును వీలైనంత త్వరగా వినియోగదారులకు రవాణా చేయాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని, అందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఉపరితల గనులకు కావాల్సిన యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు.
బొగ్గు ఉత్పత్తికి భంగం కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలి
జైపూర్, వెలుగు: బొగ్గు ఉత్పత్తికి భంగం కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని వెంకటే శ్వర్లు సూచించారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్‌తో కలిసి ఇందారం ఓపెన్ కాస్ట్‌ను పరీశిలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సంపు ఏరియాలో ఉన్న బొగ్గు నిల్వల ఉత్పత్తికి భంగం కలగకుండా ఉత్పత్తి చేసి, రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్నారు. ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్లు నాగరాజు, రామకృష్ణ రావు, ఓసీపీ గని మేనేజర్లు శ్రీనివాస్, రవి కుమార్, సర్వే అధికారి సంపత్, ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.