హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) మళ్ళీ సంక్రాంతికి సిద్దమవుతున్నాడు. తనకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు వచ్చాయట.అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు సినీ సర్కిల్ లో వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 9 (ఉగాది) సందర్భంగా ఈ ఫన్ జనరేటింగ్ కాంబో మూవీకి క్లాప్ పడబోతుందట.ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులను ఆహ్వానించే పనిలో ప్రొడ్యూసర్స్ ఉన్నారని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా టైటిల్ ను కూడా పూజా ఈవెంట్ లోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించబోతున్నాడు.కాగా లాంఛింగ్ సెర్మనీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అంతేకాకుండా హీరో వెంకటేష్ కు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. అందుకే ఈ సినిమాను 2025 సంక్రాంతి రిలీజ్ చేయబోతున్నారట. అలాగే సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చేలా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట మేకర్స్.
ప్రస్తుతం ఈ కాంబోకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి సంక్రాంతి టైటిల్ తో సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ఎలాంటి రిజల్ట్ ను అందుంటాడో చూడాలి.
ఇటీవలే సైంధవ్ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్..ఆ సినిమాతో అభుమానులను అలరించలేకపోయాడు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ మోడ్ లో కనిపించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో వెంకీ F2,F3 వంటి సూపర్ హిట్ కాంబోలో సినిమా తీయడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట.మరో రెండ్రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.