ఎఫ్2, ఎఫ్3 లాంటి రెండు హిలేరియస్‌ఎంటర్‌టైనర్స్‌తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు. నెల రోజులకు పైగా సాగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో, లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్, సాంగ్స్ చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో, వెంకటేష్ సంప్రదాయ దుస్తులలో కళ్లద్దాలతో కనిపిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ చీరలో ట్రెడిషినల్‌గా, మీనాక్షి చౌదరి మోడరన్ అవతార్‌లో ఆకట్టుకున్నారు.
ఎక్స్ కాప్, అతని ఎక్స్‌లెంట్‌వైఫ్, ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రైయాంగిల్‌క్రైమ్ ఎంటర్‌టైనర్‌లో.. వెంకటేష్ వైఫ్‌గా ఐశ్వర్య రాజేష్, గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.