SankranthikiVasthunam:స్టేజ్పై హీరోయిన్స్తో పాటపాడుతూ.. డ్యాన్స్ ఇరగదీసిన వెంకీ మామ

SankranthikiVasthunam:స్టేజ్పై హీరోయిన్స్తో పాటపాడుతూ.. డ్యాన్స్ ఇరగదీసిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్ తన లేటెస్ట్ మూవీతో 2025 సంక్రాంతి విజేతగా నిలిచాడు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ పండుగ టైటిల్ తోనే వచ్చి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ అండ్ టీమ్ సినిమా సక్సెస్ ఈవెంట్ గ్రాండ్‍గా జరుపుకుంది.

ఆదివారం జనవరి 26న భీమవరంలో బ్లాక్‍బస్టర్ సంబరం పేరుతో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో వెంకటేష్ తన హీరోయిన్స్తో అదిరిపోయే డ్యాన్స్ లతో స్టేజీపై దుమ్మురేపేశాడు. అంతేకాకుండా బేసికలీ సాంగ్ పాడుతూ అభిమానుల్లో జోష్ పెంచారు.  పాటపాడుతూ డ్యాన్స్ చేశారు. యంగ్ హీరోయిన్స్ ఐశ్వర్య, మీనాక్షితో సహా వెంకీ మామ ఫుల్ జోష్‍తో స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ డ్రామా డాకు మహారాజ్

అయితే, షూటింగ్ చేసాం. రెమ్యునరేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిద్దాం. అని కాకుండా ఒక సగటు సినిమాని ఎంత గొప్పగా జనాల్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఆలోచించారు హీరో వెంకటేష్. అందుకు తగ్గట్టుగానే సినిమాకు ముందు రీల్స్ తో, ఈవెంట్ ప్రమోషన్స్తో దూసుకెళ్లారు. ఇక చేసిన ప్రతిదీ దాన్ని ఆడియన్స్ ఓన్ చేసుకునేలా హీరో వెంకీ మామ ప్రూవ్ చేసాడు.

జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రెండో వారంలో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే రూ.260 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటినట్టు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీ 14 రోజుల్లో మొత్తం రూ.156.78 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఫుల్‌‌ ఆఫ్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌.. అద్భుతమైన పాటలు, డైలాగ్స్, యాక్షన్‌‌తో అనిల్‌‌ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్‌‌‌‌లో మరో హిట్ కొట్టి సత్తా చాటాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.