Sankranthiki Vasthunnam: ఫలించిన వెంకీ మామ ప్రమోషన్స్.. టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ దూకుడు

విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) మూవీ రేపు జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ ఫిల్మ్‌‌‌‌తో హిట్ కాంబో (వెంకటేష్-అనిల్ రావిపూడి) వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

అందుకు తగ్గట్టుగానే మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆడియన్స్కి దగ్గరయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన రీల్స్, ఈవెంట్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి. దీంతో సంక్రాంతి సరైన విన్నర్ వెంకీ మామ.. అనేలా జోరు కొనసాగుతుంది.

ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ సెన్సేషనల్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం బుక్ మై షోలో ఈ మూవీ ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికే 100K+ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంటే ఈ మూవీకి లక్ష టికెట్లు బుక్ మై షోలోనే అమ్ముడయ్యాయి అన్నమాట. ఇంకా ఆ లెక్క కొనసాగుతూనే ఉందంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హైదరాబాద్లో అడ్వాన్స్ సేల్స్ ద్వారా 1.6 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని టాక్. యూఎస్ఏతో సహా అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే హవా కొనసాగుతోంది. కేవలం నైజాంలోనే ఇంత హంగామా ఉంటే, ఆంధ్ర, సీడెడ్ లో ఇంకెంత జోరు ఉంటుందో ఊహించేసుకోవొచ్చు. ఇకపోతే.. వెంకటేష్ కు ఇప్పటి వరకు తొలి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేసిన మూవీ అంటే ఎఫ్3. ఈ మూవీ ఫస్ట్ డే సుమారు రూ.14కోట్లను రాబట్టింది.

అయితే, బుకింగ్స్ బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ మార్కును దాటేయడం అలవోకగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాంతో వెంకీ మామకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉండనుంది. ఈ లెక్కన చూస్తే ఫస్ట్ డే రూ.20కోట్ల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.