Venkatesh Iyer: పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్.. ఎవరీ శ్రుతి రంగనాథన్..?

Venkatesh Iyer: పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్.. ఎవరీ శ్రుతి రంగనాథన్..?

టీమిండియా ఆల్‌రౌండ‌ర్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడు వెంకటేష్ అయ్యర్ కు 2024 మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిలించిందనే చెప్పుకోవాలి. ఐపీఎల్ లో అడగొట్టిన అయ్యర్.. తాజాగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు  శృతి ర‌ఘునాథ‌న్‌ను ఆదివారం (జూన్ 2) ద‌క్షిణ భార‌త సంప్ర‌దాయ ప‌ద్ద‌తితో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం చాలా నిడారంబరంగా జరిగింది.  

ఇరు కుటుంబ సభ్యులతో పాటు.. కొద్దిమంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా వీరి వివాహం జరిగింది. వెంకటేష్ అయ్యర్  పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కొత్త జంటకు నెటిజన్స్ తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా..     2023 నవంబర్ 21న  వెంకటేష్, శృతి నిశ్చితార్థం జరిగింది.

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్ గెలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ  చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. చివరిసారిగా 2021 లో టీమిండియా తరపున ఆడిన అయ్యర్.. పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.    

ఎవరీ శ్రుతి రంగనాథన్..?

శ్రుతి రంగనాథన్ గురించి ఎవరనే విషయాన్ని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈమె వెంకటేష్ అయ్యర్ కు చిన్ననాటి స్నేహితురాలు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. శృతి ర‌ఘునాథ‌న్ ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్. బెంగళూరులోని ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు.