టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ 2024 లో అయ్యర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో అతను లంకాషైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయ్యర్ ఐదు వారల పాటు ఇంగ్లాండ్ కౌంటీల్లోనే కొనసాగుతాడు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగే దులీప్ ట్రోఫీకి సమయానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ అనుభవం తనకు ఉపయోగపడుతుందని అయ్యర్ అన్నాడు.
"ఇంగ్లండ్‌కు వెళ్లి నా కెరీర్ లో తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. లంకాషైర్ చాలా చారిత్రాత్మక కౌంటీ. సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఇంగ్లీష్ పరిస్థితుల్లో వన్డే, ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం నా ఆటను మెరుగుపరుస్తుంది. నేను రెండు ఫార్మాట్ లలో నా జట్టుకు అత్యుత్తమ ఆటను అందించడానికి ప్రయత్నిస్తాను". అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేసినా.. భారత జట్టులో వెంకటేష్ అయ్యర్ కు శ్రీలంకతో జరగబోయే సిరీస్ కు స్థానం లభించలేదు. పాండ్య, దూబే, అక్షర్ పటేల్, సుందర్ లాంటి ఆల్ రౌండర్లు భారత్ జట్టులో మెరుగా రాణించడం వలన అయ్యర్ కు నిరాశ తప్పడం లేదు. చివరిసారిగా వెంకటేష్ అయ్యర్ 2022 లో శ్రీలంక పై టీ20 సిరీస్ లో ఆడాడు.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయ్యర్ జూన్ 2, 2024 లో పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను ఆదివారం (జూన్ 2) దక్షిణ భారత సంప్రదాయ పద్దతితో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం చాలా నిడారంబరంగా జరిగింది.
Venkatesh Iyer is set to shine in English conditions. 🏏🔥 pic.twitter.com/Fd9H3YnzO3
— CricketGully (@thecricketgully) July 26, 2024