సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ పాడిన వెంకీ మామ

సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ పాడిన వెంకీ మామ

ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను ఉత్సాహపరిచేందుకు స్టార్ హీరోలు అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటారు. వెంకటేష్ ఇప్పటికే ‘గురు’ చిత్రంలో  తన ఎనర్జిటిక్ వోకల్స్‌‌‌‌‌‌‌‌తో  పాడిన ‘జింగిడి జింగిడి’ సాంగ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మరోసారి అలరించబోతున్నారు.  ఈసారి  సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' లోని ట్రాక్‌‌‌‌‌‌‌‌కి తన వాయిస్‌‌‌‌‌‌‌‌ని అందిస్తున్నారు. మొదట ఈ స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం బాలీవుడ్ సింగర్‌‌‌‌‌‌‌‌ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారట. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్మ్‌‌‌‌‌‌‌‌తో  ఆ పాటను తానే పాడారు. 

ఆయన పాడుతున్నప్పుడు తీసిన  ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌సిటీలో జరుగుతోంది.  ఇందులో  వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో నటించగా,  ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు.  ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి  కానుకగా  జనవరి 14న సినిమా విడుదల కానుంది.