మల్లీశ్వరి సినిమా రీ-రిలీజ్.. కానీ థియేటర్స్ లో కాదు.. ఎక్కడ చూడాలంటే..?

మల్లీశ్వరి సినిమా రీ-రిలీజ్.. కానీ థియేటర్స్ లో కాదు.. ఎక్కడ చూడాలంటే..?

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కే. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లీశ్వరి సినిమా సొప్పర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా వికట్రీ వెంకటేష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించగా నరేష్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, సునీల్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. 

ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోర్ అందించగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోఠి సంగీతం అందించాడు. మల్లీశ్వరి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 20 ఏళ్ళు దాటినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సీన్స్, పాటలు ఇప్పటికీ యూట్యూబ్ లో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వెంకీమామ టైమింగ్, బ్రమ్మి, సునీల్ కామెడీ ఇలా ఆడియన్స్ ని కట్టి పడేశాయి. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైలాగులతో మ్యాజిక్ చేశాడు.

అయితే కామెడీ ఎంటర్ టైన్మెంట్ జోనర్ సినిమాల లవర్స్ కి మల్లీశ్వరి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 22న ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రస్తుతం మల్లీశ్వరి సినిమా 4కే వెర్షన్ ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రీ రిలీజ్ థియేటర్స్ లో కాదు "ది రైటర్స్ రూమ్ కేఫ్" లో అని తెలుస్తోంది. 

ఈ కేఫ్ లో సినిమా చూడటానికి ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. కానీ సినిమా చూస్తున్న సమయంలో ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ "ది రైటర్స్ రూమ్ కేఫ్" హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెం 79 లో ఉంది. సరదాగా శనివారం మంచి కామెడీ ఫిలిం ఎంజాయ్ చెయ్యాలనుకున్నవారు "ది రైటర్స్ రూమ్ కేఫ్" కి వెళ్లి చిల్ అవ్వండి..