Saindhav Twitter Review: యాక్షన్ మోడ్లో వెంకీ.. సైంధవ్‌ ట్విట్టర్ రివ్యూ!

టాలీవుడ్ హీరో వెంకటేశ్(Venkatesh) నటించిన లేటెస్ట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సైంధవ్‌(Saindhav). దర్శకుడు శైలేష్ కొలను(Sailesh kolanu) తెరకెక్కించిన ఈ సినిమాలో.. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించారు. వెంకటేశ్ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ఈరోజే(జనవరి 13) థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోస్ పడటంతో.. సైంధవ్‌ మూవీ చూసిన వెంకటేష్ అభిమానులు, కామన్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. 

సైంధవ్‌ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో వెంకీమామ రఫ్ఫాడించారట. ప్రతి సీన్‌లో బుల్లెట్ల వర్షం కురిపించి ఆడియన్స్ ను థ్రిల్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓపక్క యాక్షన్ సీన్స్ తో మెస్మరైజ్ చేస్తూనే.. మరోపక్క ఎమోషనల్ సీన్స్ తో గుండెలను పిండేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు శైలేష్ తీసుకున్న కథ, ఆ కథను నడిపించిన తీరు చాలా బాగుందంటున్నారు. ఇక ఇంటర్వెల్‌ లో వచ్చే ట్విస్ట్‌  వేరే లెవల్ అంటూ.. సినిమాపై పాజిటీవ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మరి ఓవర్ ఆల్ గా సినిమా ఎలా ఉందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.