Sankranthiki Vasthunnam: 3 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ విక్టరీ

విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న రిలీజైన ఈ మూవీ వంద కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జనవరి 17న సంక్రాంతికి వస్తున్నాం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి కలెక్షన్స్ వెల్లడించారు.

" ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం మూవీ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.106కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు" మేకర్స్ తెలిపారు. సంక్రాంతి బాక్సాఫీస్‌ను వెంకీ మామ సొంతం చేసుకుని.. థియేటర్లలో పండుగ వేడుకలకు ప్రాణం పోశాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికీ ఈ మూవీ రూ.62కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి వెంకటేష్కు బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా నిలిచింది. రెండో రోజు రూ.77 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ALSO READ | Pushpa2Reloaded: థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్ వెర్షన్.. టికెట్ ధరలను తగ్గించిన మేకర్స్

ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, సాంగ్స్, మేకర్స్ ప్రమోషన్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. వెంకటేష్ అండ్ టీమ్ చేసిన రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తున్నాయి. దీంతో థియేటర్‌లో ప్యాక్డ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి వస్తున్నారు. ఇప్పటికీ అన్నీ ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కళకలాడుతోంది. రూ.42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. 3 రోజుల్లోనే 100 కోట్లకి పైగా వసూళ్లు చేయడం విశేషం.