రూ.300 కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతున్న వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం..

రూ.300 కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతున్న వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం..

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఈఏడాది సంక్రాంతి బరిలో దిగి విన్నర్ గా నిలిచింది. ఒకరకంగా చెప్పాలంటే మళ్ళీ 2019 సంక్రాంతి రికార్డ్స్ ని రిపీట్ చేసింది. ఫ్యామిలీ & కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో రిలీజ్ అయిన మొదటివారంలోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ పూర్తి చేసి దర్శక నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది. 

అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రూ.300 కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ అంశం వెంకీమామకి బాగానే కలసి వస్తోంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమా ప్రొడక్షన్ హౌజ్ ఒకటే కావడంతో పలు చోట్ల గేమ్ ఛేంజర్ కి షోలు తగ్గించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి షోలు పెంచారు. దీంతో ఈ వారాంతంలో రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఇప్పటివరకూ రూ.285 కోట్లు పాగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ నెల 7న మరో స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఈ లోపే రూ.300 కోట్లు మార్క్ అందుకుంటే వెంకీమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుంది.

ఈ విషయం ఇలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ కలసి డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ని నిర్వహించారు. ఇందులోభాగంగా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ నెల్లూరు హక్కులను రూ. 1.62 కోట్లకు కొనుగోలు చెయ్యగా దాదాపుగా 400% శాతం లాభం వచ్చిందని  తెలిపాడు. ఇక నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కూడా ఈ సినిమా వల్లే నష్టాల నుంచి బయటపడగలిగామని ఇందుకుగానూ డైరెక్టర్ అనిల్ రావిపూడికి థాంక్స్ తెలిపారు.