Sankranthiki vasthunam Day 5 Collections: 5 రోజుల్లో రూ.161 కోట్లు కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం... దిల్ రాజు బ్రదర్స్ సేఫ్..

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు,  శిరీష్ నిర్మించారు. ఫ్యామిలీ కామిడీ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా వెంకీమామ కామెడీ, డైరెక్టర్ అనిల్ రావిపూడి టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా ఉండటంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. 

అయితే ఈ సినిమా రిలీజ్ అయి నేటితో 5 రోజులు పూర్తవడంతో లేటెస్ట్ కలెక్షన్స్ ప్రకటించారు మేకర్స్. ఇప్పటివరకూ సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద రూ.161 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ మొత్తం కలెక్ట్ చెయ్యగా ప్రస్తుతం లాభాల్లోకి వచ్చింది. అలాగే ఓవర్సీస్ లో కలెక్షన్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ ని అందుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి రోజురోజుకి రెస్పాన్స్ పెరుగుతుండటంతో థియేటర్స్ లో షోల సంఖ్య పెంచుతున్నారు.

ALSO READ | SankranthikiVasthunnam: వెంకటేష్ అఖండ విజయం.. బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్తో దూసుకెళ్తోన్న సంక్రాంతికి వస్తున్నాం

ఈ విషయం ఇలా ఉండగా ఈసారి నిర్మాత దిల్ రాజు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగింది. కానీ ఈ సినిమా  ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. దీంతో పలు చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వచ్చనట్లు సమాచారం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దిల్ రాజు బ్రదర్స్ సేఫ్ అయినట్లు తెలుస్తోంది.