Sankranthiki Vasthunam: అఫీషియల్.. సంక్రాంతికి వ‌స్తున్నాం కలెక్షన్స్ అనౌన్స్.. వెంకీ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్

విక్టరీ వెంక‌టేష్ నటించిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు (జనవరి 14న) బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా (జనవరి 15న) ప్రకటించారు.

ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. "పండగకి వచ్చారు.. అసలైన పండగని తెచ్చారు.. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి భారీ విజయం అందుకుంది. వెంకీమామ ఆల్ టైమ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్తో అదరగొట్టాడు" అంటూ మేకర్స్ వెల్లడించారు. ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.25కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సంక్రాంతికి రిలీజైన వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీతో పోలిస్తే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా 5 రేట్లకి పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

ALSO READ | SankranthikiVasthunam: వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

ఈ మూవీ ఓవర్సీస్లో సైతం దుమ్ములేపుతోంది. ఉత్తర అమెరికా ఆడియన్స్.. టికెట్లను హాట్ కేకుల్లా కొంటున్నారు. దాంతో అక్కడ ఈ మూవీ $700K గ్రాస్ మార్కును అధిగమించినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే తొలిరోజు ఆరు కోట్లను ద‌క్కించుకున్న‌ది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఆడియన్స్ రెస్పాన్స్ దృష్ట్యా అదనపు షోలు జోడించబడుతున్నాయి అంటూ మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు అన్నివర్గాల వారిని అలరిస్తోంది. అసలు సిసలైన పొంగల్ ధమాఖా ఇచ్చాడంటూ వెంకీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.భార్య‌కు, మాజీ ప్రేయ‌సికి మ‌ధ్య న‌లిగిపోయే పాత్ర‌లో వెంకీ తనదైన కామెడీ టైమింగ్‌ తో అదరగొట్టాడు. ఇక పంచ్ డైలాగ్స్‌తో అయితే చెప్పక్కర్లేదు.. వెంకీ దుమ్ములేపాసాడు. వెంక‌టేష్ భార్య‌గా ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించ‌గా...మాజీ ల‌వ‌ర్‌గా మీనాక్షి చౌద‌రి క‌నిపించింది.అయితే సినిమా సక్సెస్ కు భీమ్స్ కంపోజ్ చేసిన పాట‌లు మంచి హైప్ తీసుకొచ్చాయి.