టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, ఫ్యామిలీ మూవీస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిలియో మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా విశేషాలేంటో చూసేద్దాం..
కథ: మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో వై.డి.రాజు(వెంకటేష్) హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. రాజు పవర్ఫుల్ ఆఫీసర్ గా పని పనిచేస్తుంటాడు. ఈ సమయంలో మీనాక్షి (మీనాక్షి చౌదరి)తో పరిచయం ఏర్పడుతుంది. దీంతో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. కానీ అనుకోకుండా విడిపోతారు. ఆ తర్వాత రాజు భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్) ని పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లయిన తర్వాత మళ్ళీ మీనాక్షి రాజు లైఫ్ లోకి వస్తుంది. ఈ క్రమంలో రాజు, మీనాక్షి ఓ ఇంపార్టెంట్ మిషెన్ కోసం కలసి పని చెయ్యాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగింది..? ఇంతకీ మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వెనకటేష్ తన నటనతో ఆడియన్స్ కట్టిపడేశాడని చెప్పవచ్చు. ఇక కామిడీ టైమింగ్ కి వెంకీమామ పెట్టింది పేరు. దీంతో కామెడీ సీన్స్ లో ఇరగదీశాడు. ముఖ్యంగా పంచె కట్టు, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ యూనిఫార్మ్ లో లుక్స్ లో యాక్టింగ్ అదరగొట్టాడు. లక్కే భాస్కర్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే మీనాక్షి చౌదరి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించింది. ఇందులో ముఖ్యంగా పవర్ఫుల్ లేడీకాప్ లో బాగానే అలరించింది. ‘మీను’ సాంగ్‌లో వెంకీ, మీనాక్షిల మధ్య ఫ్లాష్‌బ్యాక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇక హౌజ్ వైఫ్ పాత్రలో హోమ్లీ గా కనిపించిన ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో మెప్పించింది. గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ లో వెంకటేష్ తో కలసి స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఫస్టాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లు ఉన్నప్పటికీ కామెడీ ట్విస్ట్ సెకెండాఫ్ పై ఆసక్తిని పెంచింది. ఫర్వాలేదనిపించింది.
సెకండాఫ్ స్టార్టింగ్ లో వచ్చే పోలీసు యాక్షన్ సన్నివేశాలు, నటుడు విటి గణేష్ కామెడీ, ఇవన్నీ ఫర్వాలేదనిపించాయి. సీనియర్ నటులు ఉపేంద్ర, సాయికుమార్, నరేష్ తదితరులు తమ పాత్రలకి చక్కగా న్యాయ చేశారు. కానీ క్లైమాక్స్ లో మరింత జాగర్తగా చేసి ఉండాల్సింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఎమోషన్స్ మిక్స్ చెయ్యడంతో ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాదు. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావిపూడి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా వ్యవహరించాడు. మేకింగ్ విషయంలో యాక్షన్స్ సీన్స్ కి పెద్దగా స్కోప్ లేకుండా ఫ్యామిలీ కామెడీతో ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కొంతమేర ఫలించిందని చెప్పవచ్చు. అయితే గతంలో వెంకీమామతో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకేకించినతెరకెక్కించిన అనుభవం ఉండటంతో కామెడీ టైమింగ్ ని పట్టేశాడు. దీంతో కామెడీ సీన్స్ చక్కగా పండాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వెంకటేష్ తన కొడుకుతూ బుల్లి రాజుతో వచ్చే సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి.
Also Read : మహా కుంభమేళాలో అఖండ 2 తాండవం..
మ్యూజిక్ విషయానికొస్తే భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మ్యూజిక్ ఈ సినిమాకి మ్యాజిక్ లా పని చేసింది. గోదారి గట్టు మీద రామచిలక, మీను, సంక్రాంతి బ్లాక్ బస్టర్ తదితర సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. బీజియం కూడా సన్నివేశాలకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సింక్ చేశాడు. దీంతో ఈ అంశం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ విషయానికొస్తే ఈ సినిమాకి ప్రముఖ ఎడిటర్ తమ్మిరాజు పని చేశాడు. తమ్మిరాజు గతంలో బాహుబలి, మగధీర పని చేసిన ఎక్స్ పీరియన్స్ ని ఈ సినిమాకి ఉపయోగించాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కి కత్తెర పెట్టి ఉంటే బాగుండేది. దీంతో ల్యాగ్ తగ్గి ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండేది. ప్రొడక్షన్ విభాగంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంది. కొన్ని సీన్స్ మేకింగ్ విషయంలో ప్రొడక్షన్ వాల్యూస్ స్పష్టంగా తెలుస్తున్నాయి.
తీర్పు: అనిల్ రావిపూడి నుంచి కొత్తదనం కోరుకోకుండా యాక్షన్, కామెడీ ఎంజాయ్ చెయ్యాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. అలాగే ఫ్యామిలీతో కలసి సంక్రాంతి పండుగకి సినిమా వెళ్లాలనుకునేవాళ్ళకి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్ మెంట్ ఫీస్ట్ అని చెప్పవచ్చు.