వెంకీమామ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది...

వెంకీమామ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది...

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏ సినిమాలో వెంకటేష్ కి జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. దీంతో సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

ఇందులోభాగంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్ర ట్రైలర్ ని జనవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ సభ్యులతోపాటూ నిర్మాత దిల్ రాజు కూడా రానున్నట్లు సమాచారం.

ALSO READ | DaakuMaharaaj: నిన్న ఫీలింగ్స్.. నేడు దబిడి దిబిడి.. ఏంటీ శేఖర్ సార్? ఈ స్టెప్పులు

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గోదారి గట్టు మీద రామ చిలకవే, మీను, రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా ట్రైలర్ పై కూడా ఆసక్తిని పెంచాయి. అయితే గత ఏడాది సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన వెంకీమామ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయాడు. దీంతో ఈసారైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకంటాడో లేదో చూడాలి.