మా సినిమాకు అమెరికా నుంచి అమలాపురం వరకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్: నిర్మాత దిల్ రాజు

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మంగళవారం సినిమా విడుదలై, సక్సెస్ టాక్ అందుకున్న సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.

వెంకటేష్ మాట్లాడుతూ ‘సినిమాకు ప్రతి థియేటర్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.  రియాక్షన్స్ అన్నీ జెన్యూన్‌‌గా ఉన్నాయి.ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌‌కు థ్యాంక్స్. అనిల్ నా కెరీర్​లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనందంగా ఉంది’ అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్, యూత్ వెళ్తుంటారు. కానీ ఈ సినిమాకు ఉదయం నాలుగున్నరకే ఫ్యామిలీస్‌‌ వెళ్లడం మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. బేసికలీ, టెక్నికల్లీ, కలర్ ఫుల్లీ, హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్’ అని చెప్పాడు.

‘అమెరికా నుంచి అమలాపురం వరకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రేక్షకులు నాన్‌‌ స్టాప్‌‌గా నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని దిల్ రాజు అన్నారు.  హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్.. విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు 
థ్యాంక్స్ చెప్పారు.