SankranthikiVasthunnam: దుమ్ము రేపుతున్న వెంకీ మామ.. సంక్రాంతికి వస్తున్నాం 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి వెంకటేష్కు బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా నిలిచింది. రెండో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ దక్కించుకుంది.

లేటెస్ట్గా ఈ మూవీ రెండ్రోజుల బాక్సాఫీస్ వసూళ్లను అనౌన్స్ చేశారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం మూవీ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.77 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇండియా వైడ్గా ఈ మూవీ తొలిరోజు రూ.25కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సంక్రాంతికి రిలీజైన వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీతో పోలిస్తే 5 రేట్లకి పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

ఇక రెండో రోజు బుధవారం రూ.20కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తొలిరోజే దాదాపు 90శాతానికి పైగా థియేటర్లలో ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం రిలీజై మూడో రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకలాడుతోంది.