విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (SankranthikiVasthunam). టైటిల్కి తగ్గట్టుగానే సంక్రాంతి పండుగ సందర్భంగా 14 జనవరి, 2025 నుండి థియేటర్లలోకి వస్తుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ వినూత్నమైన శైలిలో ప్రమోషన్స్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎవ్వరైనా టీజర్, ట్రైలర్, సాంగ్స్, ఇంటర్వ్యూలు, సభలు వీటితోనే ప్రమోషన్స్ చేస్తూ వస్తారు. కానీ, సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ మాత్రం ఇవన్నీ చేస్తూనే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసే 'రీల్స్' జానర్ ఎంచుకుని హైప్ పెంచేస్తున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఐడియాలజీని మెచ్చుకోవొచ్చు. ఎందుకంటే ఇలా వెళితేనే బాగా రీచ్ అవ్వగలం అని అలోచిస్తూ తమదైన వీడియోలు చేస్తున్నాడు. తాజాగా జయం మనదేరా సినిమాలోని చిన్ని చిన్ని ఆశలు సాంగ్ థీమ్తో చేసిన రీల్ తెగ వైరల్ అవుతుంది. ఆ సాంగ్ లో వచ్చే బిజియమ్ లో..అనిల్ రావిపూడి, హీరోయిన్స్, మిగతా నటి నటులు కోపంగా చూస్తుండగా.. హీరో వెంకటేష్ వచ్చి "ఇప్పుడు వచ్చేది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా రా కాస్త నవ్వండి" డైలాగ్ చెప్పడంతో.. రీల్ అద్దిరిపోయింది.
ALSO READ | గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
ఇలా సినిమా నేపథ్యం ఏంటనేది చెప్పడానికి వీళ్ళు ఎంచుకున్న థీమ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు.. హీరో.. అనుకుంటే.. ఎలా ఉంటుందో అనిల్ రావిపూడి చూస్తే అర్ధమైపోతుంది.
ENTERTAINMENT CINEMA RAA KAASTHA NAVVANDI 🥳#SankranthiSandadiShuru 😍#SankranthikiVasthunam in cinemas from 14th JANUARY, 2025. pic.twitter.com/u0cEpmTFC3
— Venkatesh Daggubati (@VenkyMama) January 8, 2025
ఇక ఇటీవలే నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి సక్సెస్ అయింది. భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు మేకర్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం, మహిళా ఫ్యాన్స్ తో సరదాగా నవ్వుతు మాట్లాడటం అభిమానులు ఉర్రూతలూగించింది.