AnuEmmanuel: హార్రర్ థ్రిల్లర్తో వస్తోన్న అను ఇమ్మాన్యుయేల్.. ఆసక్తిగా 'బూమరాంగ్' ఫస్ట్ లుక్ పోస్టర్

టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel),  శివ కందుకూరి  ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బూమరాంగ్‌ (Boomerang). హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ ఆండ్రీవ్‌ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ పోస్టర్ ఆసక్తి కలిగిస్తుంది. చీకట్లో ఉన్న ఓ ఇంటి ముందు శవాలు  కనిపిస్తుండగా.. ఓ వ్యక్తి వాటి మధ్యలో నుంచి కుక్కను పట్టుకుని వస్తుండటం చూడొచ్చు. వెనుకాల ఇల్లు.. మరోవైపు అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇంటెల్స్ లుక్స్ ఇలా ప్రతిదీ సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది.

యూనిక్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్‌ లండన్‌లోని జరుగుతున్నట్లు సమాచారం. రెండు స్టోరీ లైన్స్‌ ఆధారంగా కర్మ థీమ్‌తో సమాంతరంగా థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని బిగ్ మూవీ మేకర్స్‌ లిమిటెడ్‌, మై3 ఆర్ట్స్‌ బ్యానర్లపై లండన్‌ గణేశ్, డాక్టర్‌ ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తున్నారు. సితార ఫిలిమ్స్‌ లిమిటెడ్‌ ఈ చిత్రానికి లైన్‌ ప్రొడక్షన్‌ పనులు చూసుకోనుంది.

గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది అను ఇమ్మాన్యుయేల్. న్యాచురల్​స్టార్​నాని ‘మజ్ను’తో టాలీవుడ్​కి పరిచయమైన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్​. కొన్ని సినిమాలకే ఏకంగా పవన్​ కల్యాణ్​ సినిమాలో చాన్స్​ కొట్టేసింది. దీంతో తెలుగు పరిశ్రమకు మరో ఇలియానా దొరికేసిందని ఫ్యాన్స్​ సంబరపడ్డారు. కానీ, వరుస ఫ్లాపులు ఈ హీరోయిన్​ కొంపముంచాయి.

ALSO READ | Game Changer Premiers: పుష్ప బావ ఎఫెక్ట్ : సీక్రెట్ గా గేమ్ ఛేంజర్ మూవీ చూసే ప్లాన్ చేసుకున్న చెర్రీ

అను ఇమ్మాన్యుయేల్​నటించిన ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజ రెడ్డి అల్లుడు, జపాన్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌ మూవీస్గా నిలిచాయి. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అను కెరీర్ ఆగిపోయింది అనుకునేలోపే బూమరాంగ్‌ తో తిరిగొచ్చింది.

సినిమాటోగ్రఫర్‌ కం డైరెక్టర్ ఆండ్రీవ్‌ సినిమాల విషయానికి వస్తే.. రామ్‌ నటించిన కందిరీగ, ఎందుకంటే ప్రేమంటే, సాయి దుర్గ తేజ్‌ నటించిన తేజ్‌ ఐ లవ్‌ యూ సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేశాడు.