Sankranthiki Vasthunam Twitter Talk: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ టాక్.. ఎలా ఉందంటే.?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల జాతర మొదలైంది. తెలుగు స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా మంగళవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఫ్యామిలీ & యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ట్విట్టర టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించడంలో బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఎందుకంటే మరీ ఎక్కువ యాక్షన్ సీన్స్ లేకుండా, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివాటితో ఆడియన్స్ ని కట్టిపడేస్తుంటాడు. ఇదే తరహాలో చేసిన సంక్రాంతికి వస్తున్నాం ప్రయోగం సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా అబౌవ్ యావరేజ్ టాక్ దక్కించుకుంది. 

ఇక ఈ సినిమాలో వెంకీమామ కామెడీ, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా వెంకీమామ తన కొడుకు బుల్లి రాజుతో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ గా నవ్విస్తాయి. సాంగ్స్ కూడా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా గోదారి గట్టుమీద రామ చిలకవే సాంగ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేసింది.


అయితే ఓవరాల్ గా సినిమా మొత్తంగా చూస్తే  కొన్ని చోట్ల కామెడీ సీన్స్ ఎక్కవగా ఉండటంతో బోర్ కొట్టేవిధంగా ఉన్నప్పటికీ మధ్యమధ్యలో యాక్షన్స్ సీన్స్ తో డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కానట్లు తెలుస్తోంది. ఇక ఫ‌స్ట్ హాఫ్ కామెడీతో ఎంట‌ర్‌టైనింగ్ గా ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం యావ‌రేజ్‌గా ఉంద‌ని నెటిజన్స్ అంటున్నారు. దీంతో ఈ సంక్రాంతికి ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మూవీగా సంక్రాంతికి వ‌స్తున్నాం నిలుస్తుంద‌ని ఓవ‌ర్‌సీస్ నుంచి టాక్ వ‌స్తోంది. గత ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో నిరాశ పరిచిన వెంకీమామ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం తో హిట్ అందుకున్నాడు.