అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-2 సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2019 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఎవ్వరూ ఊహించకుండా, అప్పట్లో సంక్రాంతి సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానుండగా ఇందుకు సంబంధించిన అప్డేట్సే ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తుంది యూనిట్. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా .. ఇక మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈనెల 9న ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. వెంకీ సరసన మిల్కీబ్యూటీ తమన్నా , వరుణ్ కు జోడీగా మెహ్రీన్ నటించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ్ లు తమ కామెడీ యాంగిల్ ను ఫుల్ గా చూపించారు. ఎఫ్ 3 లో అంతకు మించి అన్నట్లుగా కామెడీ ఉంటుందనే నమ్మకంతో ఉన్నామంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో అదనంగా సునీల్ కూడా ఉండబోతున్నాడు. ఆయనదీ హీరో రోల్ అనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఎఫ్-3 అంటే వెంకీ, వరుణ్, సునీల్ నవ్వుల నజరాన అంటున్నారు. అయితే కథ విషయంలో మాత్రం ఎఫ్ 2 కు, ఎఫ్ 3కి సంబంధం ఉండదని యూనిట్ సభ్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా తప్పకుండా మరో విజయాన్ని సొంతం చేసుకుని మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలకు ఆజ్యం పోస్తుందనే టాక్ వినిపిస్తుంది. హీరోలుగా ఇమేజ్ లను పక్కకు పెట్టి మంచి ఎంటర్ టైన్మెంట్ ను ఎఫ్ 2 సినిమాలో ఇచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఎఫ్ 3 లో అంతకు మించి ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తారనేది ఫిలింనగర్ టాక్. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయేమో చూడాలి.
The FUN BOMB explodes BIG with a Blasting Update ?
— Sri Venkateswara Creations (@SVC_official) May 2, 2022
Get ready to tickle your fun bones with a FUN-tastic #F3Trailer ?
Releasing on MAY 9th ?#F3Movie@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic#F3OnMay27 pic.twitter.com/2O99fJBWkw