కరీంనగర్‌‌లో‌‌‌‌‌‌‌‌‌‌ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కరీంనగర్‌‌లో‌‌‌‌‌‌‌‌‌‌ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వేంకటేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం యాగశాల ప్రవేశం, అగ్ని మధనం, అగ్నిప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగాయి. 

భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యప్ప ఆలయంలో చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాగండ్ల అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా వేంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీవారు పురవీధుల్లో విహారించారు. సినీ  గాయకులు శ్రీలేఖ, నిహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొండూరి, శ్రీనిధి భక్తి పాటలుఅలరించాయి.