భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసును నిగ్రహంగా ఉంచుకోవడంలోనే గొప్పతనం ఉందన్నారు. ఆధ్యాత్మికతతో చెడు ఆలోచనలు దూరమవుతాయని తెలిపారు.