మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మంగళగుట్ట ఆలయంలో శుక్రవారం వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆరుగురు జంటలు పీటలపై కూర్చుని స్వామి వారి కల్యాణాన్ని జరిపించారు. ముందుగా సుదర్శన హోమంను శాస్త్రోక్తంగా భార్గవ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపాక ప్రసాద్, పువ్వాల పవిత్రన్, పద్దం దీపక్, పడిగ ప్రశాంత్, పడిగ రాజేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.