వీణవంక, వెలుగు: వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో స్వామి కల్యాణాన్ని వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ పుష్కర మహోత్సవాలు ఈ నెల 6 నుంచి ప్రారంభంకాగా 14 వరకు జరుగుతాయని ఆలయ చైర్మన్ దాచేపల్లి సత్యనారాయణ తెలిపారు. ఉత్సవాల్లో అధ్యయనోత్సవం, నవవిధ కలశాభిషేకాలు, హోమాలు, రథోత్సవం, బండ్లు తిరుగుట.. కార్యక్రమాలు ఉంటాయన్నారు.