
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అలివేలు మంగ, పద్మావతి సమేతంగా వేంకటేశ్వరస్వామిని సూర్య ప్రభ వాహనంపై ఊరేగించారు. హనుమద్దాసుల మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో గర్భాలయ మెట్ల దారి గుండా తేరు మైదానం వరకు స్వామి వారి పల్లకి సేవ జరగింది.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు దర్శించుకున్న అనంతరం స్వామివారిని గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ఆలయ చైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.