కోనాయిపల్లి గుడిలో చోరీ
సిద్దిపేట రూరల్, వెలుగు : సీఎం కేసీఆర్ సెంటిమెంట్ గా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర దేవాలయంలోకి శనివారం అర్ధరాత్రి దుండగులు చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. హుండీలో రూ.25 వేల నగదు ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
ALSO READ :రూ. 80కే కిలో టమాటా
ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు రాజగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట అర్బన్ మండలం పరిధిలోని వెల్కటూర్ గ్రామంలోని భద్రకాళి, పోచమ్మ దేవాలయాల్లో ఇదే తరహాలో దొంగలు హుండీలను ఎత్తుకెళ్లారు. దొంగతనం విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ హుండీలలో రూ. 40వేల నగదు, 8 తులాల వెండి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.