VenkyAnil 3: వెంకీమామ వస్తున్నారు.. నవ్వుల పండుగని తెస్తున్నారు.. ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్  వైఫ్.. అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ..ఈ సారి సరికొత్త నవ్వుల పండుగని తెస్తున్నారు. మునుపటి కంటే ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉండేలా ఈ సక్సెస్ కాంబో దూకుడుతో వస్తున్నారు.

ఇవాళ శుక్రవారం (నవంబర్ 1న) వెంకీఅనిల్3 కాంబోకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. అందరికీ నచ్చేలా..పండుగ వాతావారణం తెచ్చేలా "సంక్రాంతికి వస్తున్నాం' (SankranthikiVasthunam) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

" వినోదం, థ్రిల్ మరియు కోసం వేచి ఉండండి.. వెంకీమామ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సీజన్‌లో మరోసారి వెలుగులు నింపేందుకు సర్వం సిద్ధమైంది.. సంక్రాంతికి వస్తున్నారు.." అంటూ మేకర్స్ తెలిపారు. 

Also Read :- సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్

ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఇటీవలే డబ్బింగ్‌ పనులు కూడా షురూ చేశారు మేకర్స్‌.

వెంకీఅనిల్ కాంబో::

వెంకటేష్,దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే F2,F3 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.ఫ్యామిలీ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థలో వచ్చిన ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టాయి.

అందుకే..వెంకీ, అనిల్ కాంబో 'సూపర్ హిట్ కాంబో'గా మారింది.ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో తెరపైకి వస్తే ఎలా ఉంటుంది... ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉంటుంది కదా..! భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నఈ మూవీని 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

  • Beta
Beta feature