బాబీ డైరెక్షన్ లో వెంకీ, చైతూ నటించిన వెంకీమామ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ శుక్రవారం వచ్చిన ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే..పైరసీదారుల ఫోకస్ ఇప్పుడు వెంకీమామపై పడింది. ఈ మూవీ ఫైరసీ సీడీలు ప్రైవేట్ బస్సుల్లో దర్శణమిచ్చాయి. విషయం తెలుసుకున్న వెంకీ ఫ్యాన్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యం వెంకీమామ ఫైరసీని బస్సులో ప్రదర్శించారు. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటేష్ అభిమానులు బస్సు డ్రైవర్ ని పట్టుకొని పోలీసులకి అప్పగించారు. ఈ బస్సు జబ్బర్ ట్రావెల్స్ కి సంబంధించినది అని తెలుస్తుండగా, హైదరాబాద్ నుండి మైసూర్ వెళ్ళే సమయంలో ఈ సినిమాని ప్రదర్శించారని తెలిపారు ప్రయాణికులు. ట్రావెల్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే వెంకీ ఫ్యాన్స్ చేసిన ఈ మంచి పనికి ప్రశంసిస్తున్నారు ఫిలింనగర్ స్టార్స్.
#VenkyMama Piracy CD was played in Jabbar Travels Bus that was on its way from Hyderabad to Mysore
Fans have caught the bus at Kurnool and a police complaint was filed at the nearest police station@SureshProdns @peoplemediafcy #SayNoToPiracy pic.twitter.com/WQYK6gYzuJ
— Vamsi Shekar (@UrsVamsiShekar) December 17, 2019