IPL 2025: అయ్యర్‌ను కాదని రహానేకు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదే: కేకేఆర్ CEO క్లారిటీ

IPL 2025: అయ్యర్‌ను కాదని రహానేకు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదే: కేకేఆర్ CEO క్లారిటీ

ఐపీఎల్ 2024 సీజన్ లో కేకేఆర్ జట్టును నడిపించిన శ్రేయాస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజీతో తెగదెంపులు చేసుకొని పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. అయ్యర్ రూ. 26.75 కోట్ల భారీ బిడ్‌ను వెచ్చించి పంజాబ్ కింగ్స్ సొంతంచేసుకుంది. దీంతో మెగా యాక్షన్ తర్వాత కేకేఆర్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా జట్టు ఏకంగా  రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. అతన్ని రిటైన్ చేసుకోకుండా వేలంలో భారీ ధరకు దక్కించుకోవడం షాకింగ్ గా మారింది.

గత సీజన్ లో అద్భుతంగా రాణించిన వెంకటేష్ ను కెప్టెన్సీ కోసమే అంత భారీ మొత్తంలో వెచ్చించారనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు అయ్యర్ తనకు కెప్టెన్సీ మీద ఆసక్తి ఉంది అని తెలియజేయడంతో అతడే కెప్టెన్ అని అందరూ అనుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా భారత వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేకు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి ఆశ్చర్యానికి గురి చేసింది. రహానే మొదట ఐపీఎల్ మెగా ఆక్షన్ లో మొదట ఎవరూ కొనలేదు. అయితే తర్వాత రౌండ్ లో రూ. 1.5 కోట్ల రూపాయల కనీస ధరకు అతడిని కేకేఆర్ దక్కించుకుంది.

రహానేకి కెప్టెన్సీ దక్కడంతో వెంకటేష్ అయ్యర్ కు నిరాశే మిలింది. రహానేపై టెస్ట్ బ్యాటర్‌గా ముద్రపడినప్పటికీ, గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (13 ఇన్నింగ్స్‌లలో 242 పరుగులు)కు అతడిచ్చిన మెరుపు ఆరంభాలు అంత ఈజీగా మరిచిపోలేరు. రహానే మంచి క్లాస్ ప్లేయర్. దీనికితోడు రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రాంచైజీ అతని వైపు మొగ్గుచూపింది. ఇదిలా ఉంటే రహానేకు కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించారో సీఈఓ వెంకీ మైసూర్ క్లారిటీ ఇచ్చాడు. 

ALSO READ | AFG v IRE: ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ బాటలో ఐరీష్.. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ రద్దు చేసుకున్న ఐర్లాండ్

వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. " కెప్టెన్సీ చాలా కష్టంతో కూడుకున్నది. దానికి అనుభవంతో పాటు చాలా పరిణితి కావాలి. రహానే అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని భావించాం. అతను 185 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడడంతో ఇండియాకు కెప్టెన్సీ చేశాడు. దేశవాళీ క్రికెట్ లో ముంబైకి కెప్టెన్సీ చేశాడు. ఐపీఎల్ లో కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆడుతున్నాడు. అతని ప్రయాణం చాలా పెద్దది. అతనికి కెప్టెన్సీ ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒకరకంగా చెప్పాలంటే అతను మాకు దొరికిన అదృష్టం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బ్యాటర్ గా కూడా అతను టన్నుల కొద్ది పరుగులు చేశాడు". అని కేకేఆర్ సీఈఓ చెప్పుకొచ్చారు.